![]() |
| మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న ఎస్సై రామారావు |
గొలుగొండ(పబ్లిక్ సత్తా)మండలంలో రాజుపేట గ్రామంలో “సంకల్పం 2.0” కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం గోలుగొండ పోలీసులు బుదవారం నిర్వహించారు.అదేవిధంగా మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలు, సైబర్ క్రైమ్‌లపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ పనులకు హాజరైన సుమారు 300 మంది కార్మికులు పాల్గొన్నారు.అనంతరం గొలుగొండ ఎస్సై,రామారావు, విఆర్ఓ మణికంఠ, మరియు గ్రామ పెద్దలు పాల్గొని ప్రజలకు చట్టాలపై, భద్రతా చర్యలు సామాజిక బాధ్యతలపై సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు మరియు పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు.
![]() |
| ఉపాధి కూలీలకు పలు సూచనలు తెలియజేస్తున్న నాయకులు |


0 Comments