చోడవరం: (పబ్లిక్ సత్తా ప్రతినిధి జగదీష్) :మరణించిన తోటి కోలాటం గురువు సురేంద్ర కుటుంబానికి లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం: తోటి మనిషి కి సహాయ పడాలంటే కోటీశ్వరుడే అక్కర్లేదు మనసుంటే చాలు అని నిరూపించారు వివరాల్లోకి వెళ్తే,చోడవరం మండలం లక్కవరం గ్రామంలో 4నెలల ముందు కోలాటం గురువు బొడ్డు.సురేంద్ర మృతిచెందారు వారి కుటుంబానికి ఉత్తరాంధ్ర సకల కళ సమితి ద్వారా లక్షా యాభైవేల సేకరించి బొడ్డు.సురేంద్ర దినకార్యం రోజున 50 వేల రూపాయల నగదును అందించారు....కోలాటం గురువు మరణించే నాటికి 8 నెలల గర్భవతిగా ఉన్న ఆయన భార్య రెండు నెలల క్రితం పాప కు జన్మనివ్వడం తో.నేడు ఉత్తరాంధ్ర సకల కళ సమితి ఆధ్వర్యం లో మిగిలిన ఒక లక్ష రూపాయలు ఆ పాప మనస్విని పేరున బ్యాంక్ లో వేసి కోలాటం గురువులు తమ ఉదారత ను చాటుకున్నారు.ఈ యొక్క నగదును చోడవరం సర్కిల్ ఇనస్పెక్టర్ అప్పలరాజు మరియు లక్కవరం మాజీసర్పంచ్ ద్వారా మరణించిన సురేంద్ర భార్యకు అందించారు ఈ కార్యక్రమంలో కోలాటం గురువులు ఉత్తరాంధ్ర సకలకల సమితి గ్రూప్ అడ్మిన్ మామిడి.దాళినాయుడు(అడ్డూరు కోలాటం గురువు) గ్రూప్ అధ్యక్షులు కర్రి రాజు, ఉపాధ్యక్షులు గేదెల కరుణాకుమార్, కార్యదర్శి పట్నారి ప్రసాద్ , సహాయ కార్యదర్శి అయితంశెట్టి జగదీష్, సెక్రటరీ పంచుకోట వెంకటలక్ష్మి, గ్రూప్ మెంబెర్స్ లోవరాజు , కోటి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు... విషయం తెలుసుకున్న గ్రామస్తులు పలువురు కోలాటం గురువులను అభినందించారు

0 Comments