పోలవరం,గైరంపేట గ్రామాల్లో ఘనంగా 'కిశోరి వికాసం' కార్యక్రమం



గొలుగొండ మండలంలోని పోలవరం మరియు లింగంపేట పంచాయతీ శివారు గైరంపేట అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం 'కిశోరి వికాసం' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐసీడీఎస్ సీడీపీవో శ్రీగౌరి మాట్లాడుతూ, బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే సమాజంలో వారికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చదువుతో పాటు ఆరోగ్యం మరియు వ్యక్తిత్వ వికాసంపై ప్రతి బాలిక ప్రత్యేక శ్రద్ధ  వహించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా కిశోర బాలికలు రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం మంచిదని శ్రీగౌరి . వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వివిధ వ్యాధులను దూరం చేసుకోవచ్చని, శారీరక మార్పుల పట్ల  అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రతి బాలిక తనలోని అంతర్లీన ప్రతిభను గుర్తించి, నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా ధైర్యంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ రాఘవ, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో కిశోర బాలికలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>