లింగంపేట యువతకు క్రికెట్ కిట్ బహూకరణ

యువత క్రీడల వైపు అడుగులు వేయాలి – తోకల సంతోష్ కుమార్

గొలుగొండ, (పబ్లిక్ సత్తా) జూన్15: గ్రామీణ ప్రాంత యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు గొలుగొండ మండలం లింగంపేట గ్రామంలో క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ తోకల సంతోష్ కుమార్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ రావుల మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ యువకులకు క్రికెట్ సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా తోకల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, యువత తమ ఖాళీ సమయాన్ని క్రీడలకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలితో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చని అన్నారు. ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావానికి దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

గ్రామంలో యువతకు అవసరమైన క్రీడా వసతుల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం పట్ల గ్రామ యువకులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మంగరాజు, గ్రామ పెద్దలు గొంతిన నాని, చేబ్రోలు మల్లేశ్వరరావు, గోల్కొండ రవిశంకర్, బొడ్డు నాని, మారిసా శివ, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>