యోగాంధ్ర ద్వారా వినూత్న నిరసన.. లోసింగి పీవీటీజీ కొందు గిరిజన గ్రామాలకు స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

యోగాంధ్ర ద్వారా వినూత్న నిరసన.. లోసింగి పీవీటీజీ కొందు గిరిజన గ్రామాలకు స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

రోలుగుంట, (పబ్లిక్ సత్తా) అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని లోసింగి రెవెన్యూ గ్రామానికి చెందిన కొత్తలోసింగి, పాతలోసింగి, పెదగరువు, పిత్రిగడ్డ గ్రామాల పీవీటీజీ కొందు ఆదివాసి గిరిజనులు తమ గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్‌కు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.

గ్రామాల్లో స్కూల్ సౌకర్యం లేకపోవడంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిరసన వేదికగా మార్చి, విద్యార్థులు, తల్లిదండ్రులు యోగాసనాలు చేస్తూ వినూత్నంగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ నాలుగు కొండశిఖర గ్రామాల్లో సుమారు 312 మంది గిరిజనులు నివసిస్తుండగా, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే 60 మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం పిల్లలు విద్యాభ్యాసం కోసం వై.బి.పట్నం పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. అలాగే అంగన్‌వాడీ సేవల కోసం గర్భిణీలు, బాలింతలు 13 కిలోమీటర్ల దూరంలోని రాజన్నపేట గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో డోలీల సహాయంతో తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.

గత ఏడాది జూన్ 24, 2025న జిల్లా విద్యాశాఖాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్ బృందం గ్రామాలను సందర్శించి పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తు చేశారు. అనంతరం రెండు ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేసినప్పటికీ, టీచర్ల నియామకానికి డిగ్రీ అర్హత నిబంధనలు విధించడం వల్ల కొండ దిగువ ప్రాంతాల వారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. స్థానికంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన యువతకు అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు.

కొండ ప్రాంతాలకు ప్రతిరోజూ చేరుకోవడం చాలా కష్టసాధ్యమైన పని కావడంతో విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పాఠశాలలతో పాటు శాశ్వత ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాని కోరారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>