కొయ్యూరులో నూతన బస్సు షెల్టర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
కొయ్యూరు, (పబ్లిక్ సత్తా) జూన్ 16:కొయ్యూరు మండల కేంద్రంలో రూ.5 లక్షల ఎంపీ ల్యాడ్స్ (MP LADS) నిధులతో నిర్మించిన నూతన బస్సు షెల్టర్‌ను ఈ నెల 17న ప్రారంభించనున్నట్లు కొయ్యూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గుమ్మా తానూజరాణి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు ముఖ్య అతిథులుగా హాజరై బస్సు షెల్టర్‌ను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అనుబంధ విభాగాల సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉప సర్పంచ్‌లు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కొయ్యూరు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిడిజన అప్పారావు పిలుపునిచ్చారు.


0 Comments