నర్సీపట్నం( పబ్లిక్ సత్తా) నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో గొలుగొండ నాతవరం మాకవరపాలెం నర్సీపట్నం మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు తమ, మండల కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో పాల్గొని నిరసనలు చేపట్టారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
చంద్రబాబు రాజకీయాల్లో వెన్నుపోటు సంస్కృతికి రెండేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

0 Comments