చోడవరం మినర్వా పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ
చోడవరం, జూలై 25 (పబ్లిక్ సత్తా): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావనను పెంపొందించే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని మినర్వా పాఠశాలలో శనివారం ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలరాజు, విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అలంకరించి నాయకత్వ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మినర్వా విద్యాసంస్థల వ్యవస్థాపకులు డి.వి.ఎస్. రాజు (రమేష్), డైరెక్టర్ అవినాష్, రత్న ఫంక్షన్ హాల్ అధినేత రాజా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.ఏసీఓ శ్రీమతి సాయి దుర్గ, లైజన్ అధికారులు ప్రమోద్ వర్మ, గోవింద్, పీఈటీ గోవింద్ పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. తల్లిదండ్రుల తరఫున దొడ్డి అరుణకుమారి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు. చివరగా శ్రీమతి శరగడం సముద్రిక వందన సమర్పణ చేయగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.



0 Comments