ఆడాకుల పంచాయతీలో ఉపాధి హామీ పనులపై ఆరోపణ

 ఆడాకుల పంచాయతీలో ఉపాధి హామీ పనులపై ఆరోపణలు...

పలువురు ఆవేదన.. సమగ్ర విచారణకు డిమాండ్!


కొయ్యూరు జూలై 27( పబ్లిక్ సత్తా )

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పంచాయతీలో పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీలో వాస్తవంగా నివాసం లేని కొంతమంది వ్యక్తులు కునిశెట్టి లోకేష్ కుమార్, జాబ్ కార్డ్ నెంబర్ 10735, అప్పిన జోషి సత్య దుర్గ మహేష్, జాబ్ కార్డ్ నెంబర్, 10699. కుని శెట్టి జయరామ్, జాబ్ కార్డ్ నెంబర్,10731. మరి కొన్ని పేర్లను ఉపాధి హామీ పనుల్లో వినియోగించి, వారి పేర్లపై పనులు జరిగినట్లు చూపించారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

దీంతో అసలు పనులు ఎవరు చేశారు? ఎంతమంది కూలీలు పనిచేశారు? ఎంత మొత్తంలో నిధులు ఖర్చు చేశారు? అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. అలాగే మండలంలో చాలావరకు ఒకే కుటుంబంలో ప్రతీ వ్యక్తికి ఒకజాబ్ కార్డు కలిగి ఉండటం వలన ఈ విషయంపై గ్రామాల్లో వివాదాలకు దారి తీస్తున్నాయి.  

ప్రభుత్వ నిధులు ప్రజల సొమ్ము కావడంతో, అవినీతి లేదా అక్రమాలకు తావు లేకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, మస్టర్ రోల్స్, కూలీల వివరాలు, బ్యాంకు చెల్లింపులు, పనుల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచారణలో అక్రమాలు నిజమని తేలితే బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారి నుంచి సొమ్మును రికవరీ చేయాలని పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>