కొత్తకోటలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

 కొత్తకోటలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

రావికమతం, జూలై 29 (పబ్లిక్ సత్తా): గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, సంకీర్తనలతో గ్రామ పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గుమ్ముడు సత్యదేవ్, షిర్డీ సాయి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పెనుగొండ నూకేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెల్లంకి ఈశ్వరరావు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త బేతా నూకరాజు మాస్టారు, ఎంపీటీసీ సభ్యులు కుంచ లక్ష్మీశంకర్, అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు కేదార్ శెట్టి సర్వేశ్వరరావు సన్స్ తదితరులు పాల్గొన్నారు.

గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో జరగడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>